కరీంనగర్లో రెండోసారి కమల వికాసం - విజయం సాదించిన బండి సంజయ్
Published : Jun 4, 2024, 4:29 PM IST
Bandi Sanjay Won Karimnagar Lok Sabha Seat (ETV Bharat)
Lok Sabha Election Results in Karimnagar 2024 :తెలంగాణలో కరీంనగర్ నియోజకవర్గం మళ్లీ బీజేపీ ఖాతాలోకే చేరింది. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. వరుసగా ఆయన రెండోసారి గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ పోటీలో నిలిచారు. బండి సంజయ్ 2.12 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.