ETV Bharat / snippets

కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనం : కేంద్రమంత్రి బండి సంజయ్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 3:21 PM IST

Bandi Sanjay Comments on Congress Party
Union Minister Bandi Sanjay on Congress Emergency (ETV Bharat)

Union Minister Bandi Sanjay on Congress Emergency : కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ విరుద్దంగా ఎన్ని అడ్డదారులైన తొక్కేందుకు, చివరకు ప్రజల ప్రాణాలను తీసేందుకు, ప్రజ్వాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడదనే దానికి ఎమర్జెన్సీ పాలనే ఓ ఉదాహరణ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతిపక్ష నాయకులను, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, జనసంఘ్ నాయకులను మీసా కింద జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.

పత్రికలపై సెన్సార్ విధించి, పౌరుల ప్రాథమిక హక్కులను హరించారన్నారు. ప్రశ్నించిన ఎంపీల సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇకనైనా కుటిల రాజకీయాలను, చీకటి ఒప్పందాలను వీడి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాలని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్థవంతంగా చర్చ జరిగేందుకు సహకరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.