ETV Bharat / snippets

రాజ్యసభలో బీఆర్​ఎస్​ పక్ష ఉపనాయకుడిగా వద్దిరాజు రవిచంద్ర

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:19 PM IST

BRS RAJYA SABHA MEMBER RAVICHANDRA
BRS Rajya sabha Deputy Leader vaddiraju Ravichandra (ETV Bharat)

BRS Rajya sabha Deputy Leader vaddiraju Ravichandra : రాజ్యసభలో బీఆర్ఎస్​ పక్ష ఉపనాయకుడిగా వద్దిరాజు రవిచంద్ర, విప్​గా దీవకొండ దామోదర్ రావులను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్​కు ఈ విషయాన్ని తెలియజేస్తూ బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా, విప్​గా దీవకొండ దామోదర్ రావులను నియమించడం పట్ల బీఆర్ఎస్​ శ్రేణులు, బీసీలతో పాటు అన్ని వర్గాల శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆశీస్సులతో రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్​ పక్ష ఉపనాయకులు, విప్ ల నియామకం పట్ల బీఆర్ఎస్​ శ్రేణులు కేసీఆర్​కు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.