ఓవర్సీస్లో 'కల్కి' జోరు - RRR రికార్డ్ బ్రేక్!
Published : Jun 13, 2024, 11:31 AM IST
Prabhas Kalki 2898 AD Tickets : భారీ అంచనాలు ఉన్న సైన్స్‌ఫిక్షన్ 'కల్కి 2898' కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని లెక్కలు వేసుకుంటూ మరి ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ చిత్రం RRRకు సంబంధించిన ఓ రికార్డును బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి 'RRR' సినిమా రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో దూకుడు చూపించింది. ప్రీ సేల్స్ భారీగా జరిగాయి. ఈ విషయంలోనే ఇప్పుడు 'RRR'ని క్రాస్ చేసింది 'కల్కి'. నార్త్ అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసిందట. సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు ఉండగానే ఈ స్థాయిలో సేల్ జరగడం రికార్డు అని చెబుతున్నారు. అంతేకాదు అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిచిందట. ఈ జోరు చూస్తుంటే కల్కి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు.