షాకింగ్ - 'కల్కి 2898 AD' ఒక్కో టికెట్ ధర రూ.2300!
Published : Jun 26, 2024, 2:17 PM IST
Kalki 2898 AD Tickets Price : ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 ఏడీ' రిలీజ్‌కు టైమ్ దగ్గర పడింది. బుకింగ్స్ జోరుగా కొనసాగుతూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అలా రిలీజ్‌కు ముందే ప్రీ సేల్స్‌లో రికార్డులు సృష్టిస్తోందీ చిత్రం. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతించాయి. అయితే పెద్ద సినిమా కాబట్టి ఒక్కో టికెట్ ధర రూ. 200 నుంచి రూ.500 వరకు ఉంటుంది. బెనిఫిట్ షోలు, బ్లాక్ టికెట్లు ఇంకాస్త ఎక్కువ ఉండవచ్చు. అయితే ఓ థియేటర్లో మాత్రం అధికారికంగా ఈ మూవీ టికెట్ ధరలు భారీ రేటుకు అమ్ముతున్నారని తెలిసింది. ముంబయిలోని మైసన్ ఐనాక్స్‌లో హిందీ వెర్షన్ టికెట్ ధరను రూ.2300గా నిర్ణయించారు. అలానే వీకెండ్ కోసం ఒక్కో టికెట్‌ను రూ.2000కు అమ్ముతోందట. ప్రస్తుతం ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.