Kalki 2898 Ad North Collections:రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD'తో నార్త్‌లో మరోసారి తన సత్తా చాటుతున్నారు. జూన్ 27న రిలీజైన సైన్స్ ఫిక్షన్ కల్కి మూవీ నార్త్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలుకొడుతోంది. ఇప్పటివరకు హిందీ బెల్ట్‌లో కల్కి ఆరు రోజుల్లో రూ.142+ కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క ఆరో రోజైన మంగళవారం ఈ సినిమా రూ.13 కోట్లు వసూల్ చేసింది.
నార్త్‌లోనూ ప్రభాస్ ర్యాంపేజ్- 6 రోజుల్లోనే రూ.150కోట్లు!
Published : Jul 3, 2024, 2:17 PM IST
![నార్త్‌లోనూ ప్రభాస్ ర్యాంపేజ్- 6 రోజుల్లోనే రూ.150కోట్లు! Kalki 2898 Ad North Collections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21858238-thumbnail-16x9-kalki.jpg)
Kalki 2898 Ad North Collections (Source: ETV Bharat)
ఇక ఇదే జోరులో బుధవారం కచ్చితంగా రూ.150 మార్క్ అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా, లాంగ్ రన్లో త్వరలోనే రూ.200 కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మైథలాజిలక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రభాస్‌తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు నటించారు