రిలయన్స్ షేర్లు కొన్నోళ్లకు గుడ్‌న్యూస్! 1:1 బోనస్ ప్రకటించిన కంపెనీ
Published : Sep 5, 2024, 5:49 PM IST
RIL approved bonus shares :షేర్ హోల్డర్లకు రిలయన్స్ గుడ్ న్యూస్ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు 1:1 బోనస్ ఇవ్వడానికి బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్, చివరిసారిగా సెప్టెంబర్ 2017లో బోనస్ షేర్లను జారీ చేసింది. అంతకుముందు 2009లో సైతం రిలయన్స్ 1:1 బోనస్ షేర్‌ను జారీ చేసింది. అలాగే కంపెనీ బోర్డు అధీకృత వాటా మూలధనాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లకు పెంచేందుకు వాటాదారుల అనుమతిని కోరింది. ఏజీఎంలో ప్రకటనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది.