national

ETV Bharat / snippets

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్​ పనుల్లో అపశ్రుతి - కూలిన కాంక్రీట్ బ్లాక్స్​​ - ముగ్గురు వర్కర్స్​ మృతి

Gujarat bridge collapse
Gujarat bridge collapse (ANI)

By ETV Bharat Telugu Team

Published : 17 hours ago

Gujarat Under Construction Bridge Collapse :ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య చేపడుతున్న బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లోని వల్సాద్‌ సమీపంలో నిర్మాణ పనులు జరుగుతుండగా అక్కడ ఉన్న కాంక్రీట్ బ్లాక్స్​ కూలిపోయాయి. వీటి కింద నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ABOUT THE AUTHOR

...view details