national

63వేల ఓట్ల ఆధిక్యంలో అమృత్‌పాల్‌ సింగ్- జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 11:44 AM IST

Lok Sabha Election Results 2024
Lok Sabha Election Results 2024 (ANI)

Lok Sabha Election Results 2024: పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌లో 'వారిస్‌ పంజాబ్‌ దే' అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 63,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జాతీయ భద్రతాచట్టం కింద అరెస్టయి జైలులో ఉన్న అమృతపాల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అమృత్​పాల్​ సింగ్​ను గతేడాది ఏప్రిల్​లోనే పంజాబ్​లోని మోగా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్‌పై నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details