ETV Bharat / snippets

ప్రభుత్వ పాఠశాలలో ఏసీ క్లాస్​రూమ్స్- స్టూడెంట్స్​ ఫుల్​ ఖుష్- టీచర్లే చందాలు వేసుకుని!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 11:10 AM IST

AC Classrooms In Government School
AC Classrooms In Government School (ETV Bharat)

AC Classrooms In Government School : ప్రభుత్వ పాఠశాలలో ఏసీ క్లాస్​రూమ్​లు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే. బంగాల్​ ముషీరాబాద్​ జిల్లా కందిలో ఉన్న రాషోర అంబికా హైస్కూల్​లో విద్యార్థుల కోసం క్లాస్​రూమ్​ల్లో ఏసీలు అమర్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా క్లాస్​రూమ్​ల్లో వేడికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు పడిపోయింది. రోజురోజుకు ఈ సంఖ్య పెరగడం వల్ల, దీన్ని ఆపేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు నడుం బిగించారు. ఈ మేరకు స్కూల్​ హెడ్​ మాస్టర్​, టీచర్స్​ కలిసి సమావేశాలు నిర్వహించి, చివరకు క్లాస్​రూమ్​ల్లో ఏసీలు బిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కంది మున్సిపాలిటీ ఛైర్మన్, స్థానిక MLA కూడా ఓకే చెప్పారు. టీచర్ల చందా, విరాళాలతో రూ.3.75లక్షల ఖర్చు చేసి 8ఏసీలు కొన్నారు. తమ ప్రయత్నం విజయవంతమైందని, స్టూడెంట్స్​ స్కూల్​ వస్తున్నారని, సిలబస్ సకాలంలో​ పూర్తి చేస్తామని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.