national

మోదీకి రజనీకాంత్​ శుభాకాంక్షలు- చంద్రబాబు, స్టాలిన్​కు అభినందనలు

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 10:12 PM IST

Lok Sabha Election 2024 Result
Lok Sabha Election 2024 Result (ANI)

Lok Sabha Election 2024 Result :సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు సినీ నటుడు రజనీకాంత్​. తమిళనాడులో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్​ను కూడా అభినందించారు. ఏపీ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకోవడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. "మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీకి అభినందనలు. దిల్లీలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​, బద్రీనాథ్​ ఆలయాలను సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈసారి కూడా అలాగే అనిపించింది." అని రజనీకాంత్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details