Salman Khan Bishnoi Issue :బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్ పెట్టిన నిందితుడు క్షమాపణులు కోరాడు. బెదిరింపు మెసేజ్‌లు పెట్టిన నంబర్ నుంచే తనను క్షమించాలని కోరుతూ ముంబయి పోలీసులకు వాట్సాప్‌లో సందేశం పంపించాడు.
సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసులో ట్విస్ట్- క్షమించాలంటూ మరో మెసేజ్
Published : 13 hours ago
ఇటీవల సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 18న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఓ మెసేజ్ వచ్చింది. లేదంటే దారుణ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ ఘటనపై ముంబయి వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సోమవారం అదే నంబర్ నుంచి మరో మెసేజ్ వచ్చినట్లు ముంబయి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. క్షమించాలని కోరుతూ వాట్సాప్‌లో మరో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.