ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అధికారంలోకి రాగానే ఊర్ల నుంచి వెళ్లగొడతాం : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి బెదిరింపులు - YSRCP MLA Topudurthi Prakash Reddy - YSRCP MLA TOPUDURTHI PRAKASH REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 12:31 PM IST

YSRCP MLA Topudurthi Prakash Reddy Comment on TDP Leader Anantapur District : ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో వైఎస్సార్​సీపీ నేతలకు భయం పట్టుకుంది. ఇప్పటి వరకు తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించగా ప్రజలు లొంగకపోవడంతో చివరి ప్రయత్నంగా బెదిరింపులకు దాడులకు దిగుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్​రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన వారిని ఊర్ల నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. రాప్తాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారు. తాను దయతలచడం వల్లే ఐదేళ్లుగా టీడీపీ నేతలు ఊరిలో ఉన్నారని అన్నారు. 

" ఇది మా మండలం. దాదాపు రూ. 50 కోట్ల వరకూ సొంత నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశాం. మా కాలి గోటికి కూడా సాటిరాదు పరిటాల చరిత్ర. ఇక్కడ ఉన్న రౌడీగాళ్లకు చెబుతున్నా 5 రోజులు ఓర్చుకోండి. ఎన్నికల్లో గెలిచిన అనంతరం నా మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే ఊళ్లు విడిపిస్తాం" _తోపుదుర్తి ప్రకాశ్​ రెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details