ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బీసీ వ్యక్తికి ఎస్సీ ధృవీకరణ పత్రం - అక్రమాన్ని ప్రశ్నించిన గ్రామస్థులపై అట్రాసిటీ కేసు నమోదు - YSRCP Leaders Cheating Case - YSRCP LEADERS CHEATING CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 4:41 PM IST

YSRCP Leaders Unfairly Filed Atrocity Case Against Victims: వైఎస్సార్సీపీ అధికారంలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత ఛైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీ నేత పెద్ద సుబ్బారావు వ్యవహరించారు. సొసైటీ ప్రహరీని రోడ్డుపైకి నిర్మిస్తున్నారని గ్రామస్థులు అప్పట్లో స్పందనలో ఫిర్యాదు చేశారు. దాంతో సుబ్బారావు వారిపై అట్రాసిటీ కేసు పెట్టారు. అతను ఎస్సీ కాకున్నా అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అండతో సుబ్బారావు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని తహశీల్దార్‌ ద్వారా సంపాదించి కేసు నమోదు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. 

గతంలో బీసీ రిజర్వేషన్‌ కోటాలో సుబ్బారావు తక్కెళ్లపాడు ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. బీసీ వ్యక్తికి తహశీల్దార్‌ అప్పటి ఎమ్మెల్యే అండగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని ఆఫ్‌లైన్‌లో మంజూరు చేశారని బాధితులు వాపోయారు. తహశీల్దారుకు విషయం చెప్పినా కూడా ఎమ్మెల్యే అండతో కుల ధృవీకరణ పత్రం మంజూరు చేశారని బాధితులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తహశీల్దార్‌, సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని బాధితులు గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details