ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'బై బై వైఎస్సార్సీపీ' నేతల వెంటే కార్యకర్తలు- టీడీపీలోకి భారీగా వలసలు - ఏపీ రాజకీయ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 10:01 AM IST

YSRCP Leaders Joining in TDP : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయి. ఒక వైపు అధికార పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఇన్‌ఛార్జీల మార్పు పార్టీ శ్రేణులను, కార్యకర్తలను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ  వీడి టీడీపీలో చేరుతున్నారు. 

వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌ బీటెక్ రవి అన్నారు. "బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమాన్ని పులివెందులలో ఆయన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వేంపల్లి మండలం కత్తులూరుకు చెందిన కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు బీటెక్‌ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. 

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడుకు చెందిన 300 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాయి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ సభలో వారంతా టీడీపీ కండువా కప్పుకొన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఇచ్ఛాపురం, బెల్లుపడ, లొద్దపుట్టి, కొజ్జరియా ప్రాంతాల వారు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.

ABOUT THE AUTHOR

...view details