ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యువతిపై వైఎస్సార్సీపీ నేత లైంగిక వేధింపులు- ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు - YCP Leader Sexual Harassment - YCP LEADER SEXUAL HARASSMENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 7:18 PM IST

YSRCP Leader Sexual Harassment on Women in YSR District : సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్ జిల్లాలో ఓ వైసీపీ నాయకుడు చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఆరోపించింది. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వడ్ల దాదాపీర్ అనే వైసీపీ నాయకుడు చాలా కాలంగా వేధిస్తున్నాడని తెలిపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వడ్ల దాదాపీర్ వచ్చి లైంగికంగా వేధించేవాడని వాపోయింది. ఎవర్నీ పెళ్లి చేసుకోకూడదని, చెప్పిన మాట వినకపోతే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు గురి చేసేవాడని యువతి ఆరోపించింది. ఈ మధ్యనే కుదిరిన పెళ్లి సంబంధాన్ని కూడా దాదాపీర్ చెడగొట్టాడని బాధితురాలు వాపోయింది. 

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని యువతి తెలిపింది. అతని వేధింపులు తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చి మరో చోటు ఉంటున్నా వేధింపులు ఆపలేదని వెల్లడించింది. వడ్ల దాదాపీర్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాడని యువతి తెలిపింది. ఎమ్మెల్యేతో దాదాపీర్ కలిసి దిగిన ఫొటోలను యువతి మీడియాకి చూపించింది. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని చాలా కాలంగా వేధిస్తున్నాడని వాపోయింది. వడ్ల దాదాపీర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని బాధిత యువతి కన్నీటి పర్యతమైంది.

ABOUT THE AUTHOR

...view details