'మేము సిద్ధమే' అధికార పార్టీకి జనసేన కౌంటర్ - చర్చనీయాంశమైన ఫ్లెక్సీ వార్ - vijayawada flexi news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 3:09 PM IST
ysrcp janasena flexi war in vijayawada : అధికార పార్టీకి చెందిన వ్యక్తి ప్రతిపక్ష నాయకులను విమర్శించడం, అందుకు సమాధానంగా ప్రతిపక్ష నేతలు కౌంటర్ వేయడాన్ని చూసే ఉంటాం. కానీ విజయవాడలో అలా జరగలేదు. అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం 'సిద్ధం' అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అందుకు కౌంటర్‌గా జనసేన పార్టీ శ్రేణులు 'మేము సిద్ధమే' అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Krishna Lanka National Highway YSRCP Janasena Parties Flexi : కృష్ణలంక జాతీయ రహదారిపై వైసీపీ సిద్ధం - జనసేన మేము సిద్ధమే అనే ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీను రోడ్డుపై నుంచి వెళ్లే వారు ఆసక్తిగా తిలకించారు. ఎన్నికలకు అధికార ప్రభుత్వమే సిద్ధంగా ఉండటమే కాదు, ప్రతిపక్ష నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.