ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 10:39 AM IST

ETV Bharat / videos

రాష్ట్ర శాసనసభ వ్యవహారాల ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు

House Sites Allotment to Legislative Department Employees: ఎన్నికల(AP Elections 2024) నియమావళి అమలులోకి వస్తుందన్న కొన్ని గంటల ముందు రాష్ట్ర శాసనసభ వ్యవహరాల ఉద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. పిచ్చికలపాలెంలో వీరికి స్థలాలు కేటాయంచాలని సీఆర్​డీఏ(CRDA) కమిషనర్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసిన 34, 66వ జీవోలను అనుసరించి ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సీఆర్​డీఏను ఆదేశించింది.

House Sites for Employees: ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం అమరావతి రాజధానిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జగన్(CM Jagan) ప్రభుత్వం(YSRCP Govt) 5 ఏళ్ల సమయం తీసుకోవడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజున జీవో ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేరుకూరుతుందా అనే అనుమానం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details