'చంద్రబాబు సీఎం అయితేనే ఆడపిల్లలకు రక్షణ- వైఎస్సార్సీపీ వేధింపులు భరించలేకనే వెళ్లిపోయాం' - YSRCP Victim Arudra - YSRCP VICTIM ARUDRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 12:13 PM IST
YSRCP Goverment Victim Arudra Expressed Happiness on TDP Victory : జగన్ సర్కారు ఘోర పరాజయం పాలవడంతో ఆయన ప్రభుత్వంలో వేధింపులు అనుభవించిన బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోయి తెలుగు దేశం ప్రభుత్వం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని కాకినాడ కు చెందిన బాధితురాలు ఆరుద్ర తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల వేధింపులు తాళలేక, తమ కుటుంబం ఏపీ వదలి వారణాసి వచ్చి బతుకుతున్నామని, చంద్రబాబు సీఎం కావడంతో ఎంతో ధైర్యం వచ్చిందని ఆరుద్ర తెలిపారు.
తాజా ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవాలని దేవుడికి తాను చేసిన పూజలు ఇప్పటికి ఫలించాయని ఆరుద్ర పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రత్యక్ష నరకం అనుభవించానని , తన బిడ్డకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురుకి జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకూ జరగవద్దని దేవునికి పూజలు చేశానని, దేవుడు కరుణించి తెలుగు దేశం ప్రభుత్వాన్ని గెలిపించారని పేర్కొంది. చంద్రబాబు సీఎం అయితేనే ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.