వైఎస్సార్సీపీ రంగులతో తోపుల బండ్లు 'సిద్ధం' - సీజ్ చేసిన అధికారులు - YSRCP COLOURED FOOD CARTS SEIZED - YSRCP COLOURED FOOD CARTS SEIZED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 11:36 AM IST
YSRCP Coloured Food Carts Seized By Officers: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ అన్ని ఎత్తులూ వేస్తోంది. రకరకాల కానుకలను ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పలు రకాల కానుకలు సిద్ధం చేశారు. దీనిపై సీ-విజిల్ యాప్‌కు ఫిర్యాదు రావడంతో అధికారులు అప్రమత్తమై సోదాలు చేపట్టి సీజ్ చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ కాలనీలో చిరువ్యాపారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన తోపుడుబండ్లను అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ రంగులతో ఉన్న తోపుడుబండ్ల వ్యవహారంపై స్థానికులు సి-విజిల్ యాప్ (C ViGIL App)లో ద్వారా ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ (Flying Squad), రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించి వైఎస్సార్సీపీ రంగులతో ఉన్న 18 తోపుడు బండ్లను సీజ్ చేశారు. అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మరికొన్ని బండ్లను అక్కడి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు తరలించారని సమాచారం.