'టీడీపీ వేధింపులతోనే యువతి మృతి' - మిస్సింగ్ కేసులో వైసీపీ చీప్ ట్రిక్స్ - YCP Tricks in Woman Missing Case - YCP TRICKS IN WOMAN MISSING CASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 10:36 PM IST
YSRCP Cheap Tricks in Woman Missing Case: పల్నాడు జిల్లాలో యువతి అదృశ్య ఘటన మలుపు తిరిగింది. తాను చనిపోలేదని, బతికే ఉన్నానంటూ ఆ యువతి వాళ్ల కటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన మనీషా ఇటీవల కనిపించకుండా పోయింది. మనీషా చెప్పులు, చున్నీ, ఓ లెటర్‌ను సాగర్ కాలువ వద్ద గుర్తించారు. తెలుగుదేశం నాయకుల వేధింపులు తట్టుకోలేకే మనీషా చనిపోయిందని స్థానిక గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నిరూపిస్తూ మనీషా ఇవాళ ఇంటికి చేరుకుంది. నరసరావుపేటలోని బంధువుల ఇంట్లో ఆ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనీషాను కిడ్నాప్ చేసి కాసు మహేష్‌రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై బురద జల్లాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఇప్పటికైన తీరు మార్చుకోవాలని కాసు మహేష్‌రెడ్డిని తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు.