ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు - అప్రూవర్ దస్తగిరి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Ys Vivekananda reddy Murder case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 4:14 PM IST

Updated : Mar 19, 2024, 4:29 PM IST

YS Vivekananda Reddy murder case approver Dastagiri : వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌ దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును అవినాష్‌రెడ్డి ఉల్లంఘించారని ఆరోపించారు. సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే 20కోట్ల రూపాయలతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నట్లు దస్తగిరి సంచనల వ్యాఖ్యలు చేశారు. ఒప్పుకోకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనకు రక్షణ కల్పించాలంటూ దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) లో అప్రూవర్ గా మారిన దస్తగిరి నేడు సంచలన విషయాలు వెల్లడించడానికి అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీ నగర్ లోని జైభీమ్ రావ్ భారత్ పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష (LIVE) ప్రసారం. 
Last Updated : Mar 19, 2024, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details