ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: తిరుమల లడ్డూ వివాదం వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Tirupati Laddu Ghee Issue - TIRUPATI LADDU GHEE ISSUE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 1:21 PM IST

Updated : Sep 27, 2024, 1:30 PM IST

YS Sharmila on Tirupati Laddu Issue : కమీషన్ల కోసమే వైఎస్సార్సీపీ నేతలు లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే కాంట్రాక్టర్‌ను మార్చారని, గత ఐదేళ్లలో టీడీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF LAB నిర్ధారించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీపై అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెను దుమారం రేగిన వేళ, మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. జగన్‌ మోహన్ రెడ్డి సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు.తిరుమల లడ్డూ వివాదం వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Sep 27, 2024, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details