ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఖాళీ స్థలమా కాజేసేయ్! - గద్దలా వాలిపోతున్న వైసీపీ నేతలు - YCP leaders Land irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 12:10 PM IST

YCP leaders Land grabbing in Kakinada: రాష్ట్రంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు భూ బకాసురులు వాలిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడలోని చీడీలపొర ప్రాంతంలో సర్వే నంబర్ 199-1-3 , 186-1-1 లోని 96 సెంట్ల భూమిలో కొంత మంది కబ్జాదారులు అర్ధరాత్రి నుంచి భారీ వాహనాలతో గ్రావెల్ తరలించి చదును పనులు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న భూ యజమానులు అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. 

1997లో 96 సెంట్లను కొనుగోలు చేశామని అప్పట్లో ఇదంతా పంట భూమిగా ఉండేదని భూ యజమానులు తెలిపారు. నగరం విస్తరించడంతో దీని విలువ రూ. 23 కోట్లకు పైగా పలుకుతుందని చెప్పారు. దీంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్లు, వైసీపీ జెండాలున్న కార్లలో సుమారు 30 మంది వచ్చి గ్రావెల్ చదును చేస్తే అడ్డుపడ్డామన్నారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించండని అడగ్గా తెస్తామని చెప్పి అక్కడనుంచి జారుకున్నట్లు వారంతా చెప్పుకొచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తమకు, తమ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరామని వారంతా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details