గంజాయి మత్తులో బార్‌లో వీరంగం- వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడిలో ఇద్దరికి గాయాలు - YCP Leader Attack - YCP LEADER ATTACK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 12:25 PM IST
YCP Leaders Attack Janasena Leader Courier Srinu : మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను బార్ పై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. బార్‌లో మద్యం సేవించేందుకు వచ్చిన పేర్ని కిట్టు అనుచరులు బీరు సీసాలతో కౌంటర్‌లో ఉన్న సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో ఇద్దరి వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియజేయగా వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బార్‌లో ఉన్న సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పేర్నికిట్టు అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Machilipatnam Krishna District : పేర్ని నాని రౌడీయిజానికి కొంత మంది పోలీసులు కొమ్ముకాస్తున్నారని శ్రీను ఆరోపించారు. తమపై దాడులు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోగా మమ్మల్నే ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొరియర్ శ్రీను వాపోయారు. స్థానిక సీఐ చర్యలు తీసుకోకుంటే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.