ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు సభకు జనాలను తరలించాడని టీడీపీ దళిత నాయకుడిపై దాడి - టీడీపీ నేతపై వైసీపీ నేతల దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 9:47 AM IST

YCP Leaders Attack in TDP Dalit Leader: అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలం మాచూపల్లిలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఎస్టీ నేత మధుకు గాయాలయ్యాయి. మాచుపల్లి హరిజనవాడకు చెందిన కోటపాటి మధు గురువారం రాత్రి ఓ దాబా వద్ద భోజనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఐదుగురు వైసీపీ నేతలు తనపై అమానుషంగా దాడి చేసి కులం పేరుతో దూషించారని మీడియా ముందు వాపోయాడు. 

ఇటీవల తెలుగుదేశం పార్టీ 'రా కదలిరా' సభకు గ్రామం నుంచి పీలేరుకు జనాలను తీసుకుని వెళ్లినందుకు వైసీపీ నేతలు కక్ష కట్టి దాడి చేశారని తెలిపాడు. దళిత నాయకుడిపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్​రాజు బాధితుడ్ని పరామర్శించారు. పరిపాలన చేతకాక వైసీపీ ప్రభుత్వం, వాళ్ల నాయకులు ఇలాంటి చిల్లర చేష్ఠలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ ప్రభుత్వమేనన్న జగన్ మోహన్​రాజు అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details