'అందువల్లే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు పదవికి రాజీనామా చేస్తున్నా!' - ap Brahmin Corporation
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 3:13 PM IST
Yanamandra Sai Suresh resigns: రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ అసోయేషన్ డైరెక్టరు పదవికి యనమండ్ర సాయిసురేష్ రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ప్రభుత్వ పథకాల్లోనూ సముచిత ప్రాధాన్యం లేకుండా అణగదొక్కుతోందని సురేష్ ఆవేదన చెందారు. గతంలో గుంటూరు కొత్తపేటలోని యడవల్లి సత్రం బకాయిల గురించి హైకోర్టులో పోరాడినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సత్రం బకాయిలకు సంబంధించి కోటి 82లక్షల రూపాయల నిధులను అందించాలని ఆదేశించినట్లు సురేష్ తెలిపారు. అయితే ఆ నిధులు రాకుండా ప్రభుత్వంలోని ముఖ్యులు అడ్డుపడుతున్నందుని ఆరోపించారు. ఈ నేపథ్యంలోన మనస్తాపానికి గురై తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోయేషన్ నుంచి తనతోపాటు మరికొందరు డైరెక్టర్లు కూడా త్వరలో బయటకొస్తారని యనమండ్ర సాయిసురేష్ చెప్పారు.
సాయిసురేష్ నిర్ణయాన్ని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య స్వాగతించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బ్రాహ్మణులకు దక్కిన పథకాలు, సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన హయాంలో రాకుండా చేశారని ఆరోపించారు. త్వరలోనే బ్రాహ్మణ సంఘాలన్నింటితో ఓ సమావేశం నిర్వహిస్తామని ఆనందసూర్య తెలిపారు.