ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'అలా చేస్తే ఖజానా నుంచి డబ్బు డ్రా చేయలేరు'- బడ్జెట్​పై కొత్త ప్రభుత్వానికి యనమల సూచన - Yanamala on AP Budget 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 12:47 PM IST

Yanamala on Vote on Account Budget : కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్​పై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కొన్ని సూచనలు చేశారు. ఈ నెలాఖరుతో గత సర్కార్ ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుందని చెప్పారు. ఈ లోగా బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు ఆమోదం లేకుంటే ఈ ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు డ్రా చేయలేదన్నారు.

అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమో లేదా ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచనలో ఉందన్నారు. దీనికి తగ్గట్లు కొన్ని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతమున్న సభ ప్రొరోగ్ చేయలేనందున ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదన్నారు. సభ ప్రొరోగ్ కాని సమయంలో ఆర్డినెన్సులను జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.

AP Budget 2024 : ఈ పరిస్థితుల్లో సభలో పూర్తిస్థాయి బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ పెట్టి ఆమోదించుకోవాలని యనమల రామకృష్ణుడు సూచించారు. జగన్ పాలనలో అసెంబ్లీ విధానాలు అభాసుపాలయ్యాయని ఆరోపించారు. సమస్యలను చర్చించడం కంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టారని యనమల విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details