కూటమి మ్యానిఫెస్టోతో అన్ని వర్గాల అభివృద్ధి- హర్షం వ్యక్తం చేస్తున్న సింహపురి మహిళలు - Alliance manifesto
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 5:34 PM IST
Good Response to NDA Alliance Manifesto: కూటమి మ్యానిఫెస్టోపై నెల్లూరు జిల్లా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సామాన్యులకు, మధ్యతరహా వర్గాలకు అందుబాటులో ఉండేలా పథకాలను రూపకల్పన చేశారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్టాన్ని అప్పులతో నిండా ముంచారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగ కల్పన చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. జగన్ ఇప్పటి వరకు చేసిన మోసాలు చాలంటున్నారు. మరోసారి జగన్‌ని గెలిపించి తప్పు చేయమని వెల్లడించారు. ఇంట్లో ఒక్క వ్యక్తి రూ.800 సంపాదిస్తే, రూ.500 తాగుడుకే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచారని గుర్తు చేశారు. చంద్రబాబు తమ పిల్లల చదువు కోసం డబ్బులు ఇస్తామంటున్నారని, ఆయన హామీ ఇస్తే అమలు చేస్తారని గుర్తు చేశారు. జగన్ మాత్రం గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేయలేదని, తాజాగా వచ్చి ప్రజలకు ఏదో చేస్తామంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పరిశ్రమలను పెట్టడం ద్వారా ఉపాధి కల్పిస్తామంటున్నారని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజాక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబును గెలిపించుకుంటామని పేర్కొంటున్న సింహపురి మహిళలతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.