స్థలం కబ్జా చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్- పవన్ కార్యాలయం ఎదుట బాధితురాలి ఆత్మహత్యాయత్నం - Women Suicide Attempt - WOMEN SUICIDE ATTEMPT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 2:34 PM IST
Women Suicide Attempt Before Pawan Kalyan Camp Office : వైఎస్సార్సీపీ కార్పొరేటర్ తన స్థలాన్ని ఆక్రమించారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయం ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన మేడిశెట్టి దుర్గాదేవి రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉన్న తన 1200 గజాల స్థలాన్ని స్థానిక కార్పొరేషన్ విజయలక్మి ఆక్రమించారని దుర్గాదేవి ఆరోపించారు. కార్పొరేటర్ విజయలక్మి, ఎన్ఎన్కే రెడ్డి అనే వ్యక్తి సాయంతో స్థలాన్ని ఆక్రమించిందని బాధితురాలు పేర్కొన్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన దుర్గాదేవి పవన్ను కలవలేదు. కానీ కార్యాలయం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఆమె పైకి ఎక్కారు. అక్కడ నుంచి దూకుతానని దుర్గాదేవి బెదిరించారు. దీంతో పోలీసులు వెంటనే పైకి ఎక్కి ఆమెను కిందకు దింపి స్టేషన్కు తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.