ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుడివాడలో మహిళ ఘరానా మోసం - అమాయకులకు మాటమాటలు చెప్పి కోటిన్నరతో ఉడాయింపు - WOMAN CHEATED IN GUDIVADA - WOMAN CHEATED IN GUDIVADA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 1:47 PM IST

Woman Cheated Innocent People and Looted One and Half Crores: ఓ మాయలేడి అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో వెలుగు చూసింది. ఈ మాయలేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ లీలావతి మాయమాటలు చెప్పి లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరి పేట, ఆర్టీసీ కాలనీ, టీడ్కో కాలనీ, జగనన్న కాలనీల్లోని మహిళలతో 60 గ్రూపులు ఏర్పాటు చేసిందని బాధితులు తెలిపారు. 

గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాల్లో లీలావతి కోటిన్నర తీసుకుందని, అంతే కాకుండా పలువురి వద్ద బంగారు ఆభరణాలు తీసుకొని తాకట్టు పెట్టి ఆ నగదును తీసుకుని ఆమె ఉడాయించిందని బాధితులు గోడు వెలిబుచ్చారు. రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు వాపోయారు. లీలావతి హైదరాబాద్​లోని మియాపూర్​లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details