ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అడవిలో అద్భుతం- చెట్టు నుంచి ఉబికి వస్తున్న జలధార - Water From Tree in Alluri District - WATER FROM TREE IN ALLURI DISTRICT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 2:02 PM IST

Water From Tree in Alluri District : సాధారణంగా నేల నుంచి నీళ్లు ఉబికి రావడం అందరికీ తెలిసిన విషయమే. కానీ చెట్టులోంచి నీళ్లు ధారాళంగా వస్తున్నాయి తెలుసా ! చెట్టు కాయలు, పండ్లు అందిస్తుందని తెలుసు కానీ నీరు ఇవ్వడమేంటి అనుకుంటున్నారా ? వినడానికి వింతను మీరూ చూసేయండి.

అల్లూరి జిల్లా రంపచోడవరం - కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్టు నుంచి శుద్ధమైన నీరు ధారాళంగా వస్తోంది. ఫారెస్ట్ రేంజ్ అధికారుల పరిశీలనలో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్లు వేలాదిగా ఉన్నాయి. కొన్నింటిలోనే నీటిని నిలువ చేసుకునే వ్యవస్థ ఉంది. నల్ల మద్ది చెట్టు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుంది. గోదావరీ నదీ పరివాహక ప్రాంతాల్లోను అటవీ ప్రాంతంలో విరివిగా ఈ నల్ల మద్ది చెట్లు ఉన్నాయి. వందల్లో ఒక చెట్టుకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details