ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు - పోటెత్తిన భక్తులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 12:40 PM IST

Vuyyuru Veeramma Thalli Tirunallu: కృష్ణాజిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తులు ఎదురుగంట దీపం, తిరుగుడు దీపాలతో వీరమ్మ తల్లి వారికి స్వాగతం పలికారు. ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి) నుంచి 15 రోజులపాటు ఈ తిరునాళ్లు కొనసాగుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు.

Vuyyuru Veerammatalli Tirunallu 2024: సంప్రదాయం ప్రకారం పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఎస్సై గణేష్ కుమార్ దంపతులు పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చలువ కావిళ్లతో అమ్మవారి మెట్టినింటికి చేరుకున్నారు. పారుపూడి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఉయ్యూరు పరిసర ప్రాంతాలు జన సంద్రంతో సందడిగా మారాయి. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details