ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉరవకొండ ఓటరు జాబితాలో డబుల్​ ఎంట్రీ - ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు - Voter List Mistakes Uravakonda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 4:45 PM IST

Voter List Mistakes in Anantapur District : ఎన్నికల అధికారులు రూపొందించిన  ఓటరు జాబితాలో తవ్వే కొద్ది తప్పులు వస్తూనే ఉన్నాయి. అధికారులు తుది ఓటరు జాబితాను కళ్లతో చూసే నమోదు చేశారా? లేక నిద్రావస్థలో రూపొందించారా? అని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో డబుల్​ ఎంట్రీ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. 
Uravakonda : ఉరవకొండ పట్టణంలోని 118 పోలింగు కేంద్రంలో మొత్తం 812 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కేంద్రంలోని వరుస సంఖ్య 856, 865లో సంపత్ కుమార్ అనే యువకుడికి డబుల్ ఓటు కల్పించారు. ఈ కేంద్రంలో నలుగురు మృతులకు, స్థానికంగా లేని ఐదు మందికి ఓటు హక్కు ఉంది. వాటిని తొలగించాలని గతంలో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అవి జాబితాలో అలాగే కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details