సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి - వీహెచ్పీ డిమాండ్ - VHP Demand On TTD Laddu - VHP DEMAND ON TTD LADDU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 4:44 PM IST
VHP On TTD Laddu Prasadam Adulteration: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై ప్రజలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని మండిపడుతున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై విశ్వ హిందూ పరిషత్ (VISHWA HINDU PARISHAD) ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖలో విశ్వ హిందూ పరిషత్ కీలక తీర్మానం చేసింది. ఈ దారుణం వెనుక ఎవరున్నా వారిని విడిచి పెట్టకూడదని అన్నారు. పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ చేయడం హిందువులుపై దాడి చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ విశాఖలో కీలక తీర్మానం చేసింది. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా విడిచిపెట్టొద్దని విశ్వహిందూ పరిషత్ నాయకులు తేల్చి చెప్పారు.