విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం - ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొని ఇద్దరు మృతి - Visakha NAD Flyover Road Accident - VISAKHA NAD FLYOVER ROAD ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 11:41 AM IST
Visakha NAD Flyover Road Accident: విశాఖ ఎన్ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తనవరపు కుమార్, అరవెల్లి పవన్ కుమార్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నంలోని ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ట్రాఫిక్‌ను మళ్లించడానికి గతంలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఇంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలతో పాటు ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.