ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి - ఈసీకు వర్ల రామయ్య లేఖ - Varla Ramaiah letter to ceo - VARLA RAMAIAH LETTER TO CEO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 10:52 PM IST

Varla Ramaiah Complaint to Chief Election Officer : ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. బద్వేల్​లో వైఎస్సార్సీపీ తరపున సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డి ఎన్నికల ప్రచారం చేశాడని గుర్తుచేశారు. వెంకట్ రామిరెడ్డి చేసిన పనికి ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. అవ్వా తాతలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని జగన్ రెడ్డి చూస్తున్నాడని దుయ్యబట్టారు. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఏ అభ్యర్థి కూడా ప్రభుత్వ భవనాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేయకూడదని తేల్చిచెప్పారు. అదే విధంగా టీడీపీ నేత పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ వ్యక్తిగత ఉద్యోగులుగా మారారని మండిపడ్డారు. ఇలాంటి అధికారుల వల్ల ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందని తెలిపారు. అధికారులు తప్పు చేస్తుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా నిలదీయటం తప్పా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details