ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆరుగాలం కష్టం బుగ్గిపాలు - శనగ పంటకు నిప్పంటించిన దుండగులు - Anantapur crop fired

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 3:26 PM IST

Unknown Persons Fired Crop In Anantapur: ఆరుగాలం ఎంతో కష్టపడి పంటను సాగు చేసుకున్నారు ఆ దంపతులు. పంటను చూసి కష్టపడ్డ శ్రమంతా మర్చిపోయారు. చేతికి అందింది అనుకున్న పంటను రాత్రికిరాత్రే దుండగులు బుగ్గిపాలు చేయటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆదుకోవాలని రైతు దంపతులు అధికారులను కోరుతున్నారు.

Farmer Requested Government To Give Compensation: అనంతపురం జిల్లా ఉరవకొండలో రామాంజనేయులు, ఉమాదేవి అనే కౌలు రైతు దంపతులు శనగపంట సాగు చేశారు. రామాంజనేయులు శనగ పంటను తొలగించి ఎట్టాలను పొలంలో కల్లం చేయడానికి సిద్ధం చేసుకుని ఆదివారం ఇంటికి వెళ్లారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పంటకు నిప్పంటించారు. సోమవారం ఉదయం రైతు పంట వద్దకు వచ్చేసరికి దగ్ధమై ఉండటంతో  రైతు కన్నీరు మున్నీరయ్యారు. శనగ పంటను సాగు చేయటానికి 15 లక్షల రూపాయల వరకూ వెచ్చించామని, పంట ధ్వంసంతో ఇదంతా బూడిద పాలయిందని రైతు దంపతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని  ఆ దంపతులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details