ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

live : కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - Rajnath Singh AP tour - RAJNATH SINGH AP TOUR

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 3:57 PM IST

Updated : May 5, 2024, 4:34 PM IST

Union Minister Rajnath Singh Road Show Live in Adoni of Kurnool District : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ సర్కార్ మాత్రం లెక్కకు మించి అప్పులు చేస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన రుణ భారం పెట్టిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసేసి పన్నుల భారం విపరీతంగా ప్రజల మీద వేసిందని ఆరోపించారు. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి హింసించిందని రాజ్​నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వం విశాఖను ఏపీకి మాదకద్రవ్యాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్​గా మార్చేసిందని రాజ్​నాథ్​​సింగ్ అన్నారు. ల్యాండ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా, మైనింగ్ మాఫియాలు ఏపీలో స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ అవినీతి ఆరోపణలలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అభివృద్ధికి కావలసిన భరోసాను కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజు త్వరలోనే ఉందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పర్యటిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 5, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details