వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు: పెమ్మసాని - Pemmasani Chandrasekhar on BSNL 4G - PEMMASANI CHANDRASEKHAR ON BSNL 4G
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 9:09 PM IST
Pemmasani Chandrasekhar on BSNL 4G Services: 2025 మార్చి నెల నాటికి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్‌ను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బీఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి పెమ్మసాని ప్రారంభించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పెమ్మసాని, 4 వేల 500 బీఎస్ఎన్ఎల్ టవర్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు వినియోగదారులకు చేరువ చేస్తామన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఇంటర్ నెట్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని, బీఎస్ఎన్ఎల్ ద్వారా ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎండీ రాబర్ట్ రవి తెలిపారు. అతి తక్కువ రేట్లలో మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రం ప్రణాళిక అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల ధరల వల్ల ప్రజలు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారని తెలిపారు. అదే విధంగా రాజధానిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.