బొగ్గుతో పాటు మృతదేహం కూడా వచ్చింది - ఉలిక్కిపడిన థర్మల్ కేంద్రం ఉద్యోగులు - UNKNOWN DEAD BODY AT RTPP - UNKNOWN DEAD BODY AT RTPP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 10:18 PM IST
Unidentified Body was Found in RTPP Industry at YSR District : వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ పరిశ్రమలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బొగ్గు వాహనంలో వచ్చిన లోడ్‌ని కిందకి దించుతుండగా అకస్మత్తుగా మృతదేహం కనిపించింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, జమ్మలమడుగు నియోజవర్గం యర్రగుంట్లలో ఆర్టీపీపీ పరిశ్రమ ఉంది. ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి బోగ్గును తీసుకొచ్చి దాంతో కరెంటును ఉత్పత్తి చేస్తుంటారు. రోజూ విధులలో భాగంగానే బోగ్గు లోడ్‌తో వచ్చిన వ్యాగన్ నుంచి అక్కడి ఉద్యోగులు బొగ్గును కిందకు దించుతున్నారు.
అందులో నుంచి ఒక్కసారిగా మృతదేహం కనిపించడంతో ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని పరిశీలించి చనిపోయాడని నిర్ధారించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెుదట మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.