ప్రభుత్వ జోక్యంతో సిమెంట్ కంపెనీ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం - Ex gratia to victims - EX GRATIA TO VICTIMS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 5:22 PM IST
Ultratech Cement Company has Announced EX Gratia to Victims : ఎన్టీఆర్ జిల్లా బుధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదానికి గురై మృతి చెందిన కుటుంబానికి యాజమాన్యం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు ప్రకటించింది. స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం కలెక్టర్, స్థానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒప్పుకున్నారు. ఈ ఆర్థికసాయం చెక్కులను కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య బాధితులకు అందించారు. అలాగే బాధితులకు వైద్యసాయం, పిల్లలకు ఉచిత విద్య చదివిస్తామని హామీ ఇచ్చారు. ఘటన తరువాత బాధితులకు అందుతున్న వైద్యసాయం, పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రమాదంపై శాఖపరమైన విచారణ చేయిస్తామన్న కలెక్టర్, లోపాలు ఏమైనా బయటపడితే ఫ్యాక్టరీపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
అయితే నిన్న(ఆదివారం) బుధవాడలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 16మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సిమెంట్ తయారీలో భాగంగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాన్ని పౌడర్‌గా మార్చే కిలెన్ విభాగంలో ట్యాంకు పగలడంతో దుర్ఘటన జరిగింది.