అడుగడుగునా పూల పరిమళం- తిరుమలలో ఉగాది వైభవం - Ugadi Celebrations at Tirumala - UGADI CELEBRATIONS AT TIRUMALA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 7:17 PM IST
Ugadi Festival Celebrations at Tirumala Temple: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. పండుగ నేపథ్యంలో ఆలయ పరిసరాలను పండ్లు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కనువిందు చేస్తున్న ఆలయ పరిసరాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో పది టన్నుల 60 రకాల పూలు, ఫలాలను వినియోగించి అలంకరణలు చేపట్టారు.
ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, సంప్రదాయ పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ధ్వజ స్థంభం చెంత అయోధ్య రాముడు ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవ ధాన్యాలతో చెసిన శ్రీ మహావిష్ణువు, శ్రీరాముడి దృశ్యాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆలయం ముందు వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన వివిధ ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.