ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం - నూజివీడు జాతీయ రహదారిపై ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 12:22 PM IST

Two Persons Died in Road Accident: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుంచి నూజివీడు వెళ్లే రహదారిలో రాణి కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కైకలూరు నుంచి దిల్లీకి చేపలలోడుతో వెళుతున్న లారీ, బైకుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  

Accident at Nuzvid National Highway: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేట నుంచి నూజివీడు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కోలా మల్లికార్జునరావు (24), మాణికల విజయ్ బాబు (26) విస్సన్నపేట మండలం కొండపర్వ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్​ కారణామేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవెేళ ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారు మద్యం సేవించి వాహనాన్ని నడిపి ఉండచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details