ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం, రెండు ఇళ్లు నేలమట్టం - తప్పిన ప్రాణాపాయం - Two Houses Collapsed

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 3:24 PM IST

house_collapsed (ETV Bharat)

Two Houses Collapsed Due to Heavy Rains in Manyam District : పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ఇళ్లు నేలకూలాయి. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలోని తంగుడు పకీర నాయుడు, చింతల విమల రాణి ఇళ్లు నేలమట్టమయ్యాయి. చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావటంతో భయంతో ఇళ్లలోని వారు బయటకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. ఘటనలో ప్రాణాపాయం తప్పటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ గౌరీ శంకర్రావు ఘటనా స్థలిని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

తంగుడు పకీర నాయుడు ఇంటిపై చింతల విమల రాణి పురాతన గోడ వచ్చి పడిపోయిందని గౌరీ శంకర్రావు పేర్కొన్నారు. వీరి కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం తప్పింది కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. విమల రాణి ఇంటి విషయంలో గతంలో హెచ్చారికలు జారీ చేసినా వారు స్పందించలేదని తెలిపారు. బాధితుడిని అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details