ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిన్నారులను కబళించిన క్వారీ- ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు మృతి - Children death in Indra Nagar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 4:26 PM IST

Two Children Died While Going Swimming At Indra Nagar: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన చిన్నారులను మృత్యువు కబళించింది. ఆదివారం కదా కాసేపు ఈత కొట్టి వచ్చేద్దాం అని వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా మారారు. చిన్నారుల మృతితో (Death) గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Children Left House Yesterday Went To Quarry: ప్రకాశం జిల్లా దోర్నాలలోని ఇంద్రానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంద్రానగర్​కు చెందిన అంజి (12), వలి (8) అనే ఇద్దరు స్నేహితులు ఆదివారం ఈతకు వెళ్లి మృతి చెందారు. దోర్నాల మండలం యడవల్లి శివారులోని క్వారీ (Quarry) గుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరూ నీళ్లలో మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను (Dead Bodies) క్వారీ నుంచి బయటకు తీశారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి పిల్లలు బయటకు వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details