ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కడప ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని పార్టీలు పోరాడాలి: తులసి రెడ్డి - Tulasi Reddy on Steel Industry - TULASI REDDY ON STEEL INDUSTRY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 4:12 PM IST

Tulasi Reddy on Establishment of Steel Industry in YSR District : వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అన్ని వసతులు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్యరూపం దాల్చలేదని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియర్‌ డా. నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. జమ్మలమడుగు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు స్టీల్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలు చిత్త శుద్ధితో సైల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం పని చేయాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టీడీపీ, వైస్సార్​సీపీ పార్టీలపై ఆధారపడి ఉంది కాబట్టి వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్ని కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details