ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విజయనగరం పర్యటనలో ప్రజల అవస్థలు - Siddharth Reddy Vizianagaram visit

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 9:05 PM IST

Byreddy Siddharth Reddy Vizianagaram visit: సీఎం జగనే కాదు వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడ పర్యటించినా సమాన్యులు అవస్థలు పడాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి విజయనగరంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి (Byreddy Siddharth Reddy) పర్యటనే ఉదాహరణ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. సిద్ధార్థరెడ్డి పర్యటన సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల ఆధ్వర్యంలో విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు.

 ఈ సందర్భంగా  పట్టణంలోని ఓ కూడలి వద్ద తీన్మార్‌ డప్పులతో ప్రదర్శన చేశారు. నాలుగు వైపులా ట్రాఫిక్‌ను నిలిపేశారు. పాఠశాల, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సైతం ర్యాలీకి అనుకూలంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వైఎస్సార్సీపీ ర్యాలీతో అసహనానికి గురైన వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎక్కడికి అక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో, దానిని క్లియర్‌ చేయటానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ సభలు సమావేశాలు అంటే ప్రజలు హడలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details