దోర్నాలలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం - తప్పిన పెను ప్రమాదం - డోర్నలలో కూలిన భవనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 9:21 AM IST
|Updated : Feb 4, 2024, 12:38 PM IST
Three Stair Building Collapsed on Srisailam Road in Dornal: ప్రకాశం జిల్లా దోర్నాలలోని శ్రీశైలం రోడ్డులో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే వాసవి లాడ్జి భవనం కూలిపోవడంతో చుట్టు ప్రక్కన వాళ్లు ఆశ్చర్యపోయారు. నూతన భవన నిర్మాణం కోసం వాసవి లాడ్జి పక్కనే పునాది గుంతలు తీశారు. ఆ గుంతల కారణంగా వాసవి లాడ్జ్‌కు పగుళ్లు ఏర్పడ్డట్లు తెలుస్తోంది.
Cracks To Vasavi Lodge in Potholes: ఆదివారం ఉదయం భవనం ఓ పక్కకు ఒరగడాన్ని లాడ్జి యాజమాన్యం గమనించింది. హుటాహుటిన అందులో ఉన్న జనాన్ని లాడ్జి సిబ్బంది ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం పక్కకి ఒరిగి కూలిపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురైయ్యారు. లాడ్జిలో ఉన్నవారికి ఎవ్వరికీ ఎటువంటి ఆపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి భవనం కూలిపోవడంతో స్థానికులు అంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని లాడ్జి యాజమాన్యం తెలిపింది.