ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యువతి హత్య కేసులో నిందితులు అరెస్ట్- 48గంటల్లో పట్టుకున్న పోలీసులు - Young Woman Rape Case UPDATES - YOUNG WOMAN RAPE CASE UPDATES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 12:58 PM IST

Updated : Jun 23, 2024, 2:30 PM IST

Three Arrested in Woman Rape and Murder Case: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో శుక్రవారం జరిగిన యువతి అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఈపురుపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, శ్రీకాంత్‌, కారంకి మహేశ్​​ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. కాగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి దీనిపై స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాల మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 10 టీమ్స్​ను ఏర్పాటుచేసి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు.

"ఈపురుపాలెం ప్రాంతానికి చెందిన పాత నేరస్థులైన దేవరకొండ విజయ్, కారంకి మహేశ్ మద్యం మత్తులో యువతిని బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్యచేసి ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని మళ్లీ ఘటనా స్థలానికి వచ్చారు. ఏమీ తెలియనట్లు అందరితోపాటు అక్కడి దృశ్యాలను చూశారు. నిందితులు ఘటనకు ముందు, తర్వాత అక్కడకు రావడాన్ని స్థానికులు గమనించారు. వీరిలో నిందితుడు శ్రీకాంత్‌ ఫోన్‌ ఆధారంగా కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలతో ముగ్గురిపై కేసు నమోదు చేశాం." - వకుల్‌ జిందాల్‌, జిల్లా ఎస్పీ

Last Updated : Jun 23, 2024, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details